కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని, అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ వంతెన నిర్మించాలని, రాష్ట్రంలో బీచ్ రోడ్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పించారు.