నడుపూరులో వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం లడ్డు దాతలకు సన్మానం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని నడుపూరు గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామంలోని వివిధ వీధుల్లో కొలువుదీరిన నాలుగు విగ్రహాలను ఒకేసారి వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు అత్యంత ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొని గణనాథునికి ఘనంగా వీడుకోలు పలికారు. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న భక్తులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు.