పనులు చేయకపోతే ప్రజలు తననే తిడతారంటూ అధికారులపై ఎమ్మెల్యే మందుల సామేలు మండిపాటు

రిపోర్టర్: శివ స్థలం: తుంగతుర్తి

పనులు చేయకుండా కూర్చుంటే ప్రజలు ముందుగా తిట్టేది తననేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో చలపతి అధ్యక్షతన బుధవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మందలించారు. జీతాలు మాత్రం ఆగడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని, అధికారుల పనితీరు మార్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు.