విద్యుత్తు కోతలతో అల్లాడిపోతున్న కోవూరు నియోజకవర్గ ప్రజలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎల్‌నినో ప్రభావం, అధిక ఉష్ణోగ్రతల వేళ కోవూరు నియోజకవర్గంలో కరెంటు కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లెల్లో తాగునీటి సరఫరా నిలిచిపోగా, ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అల్లాడుతున్నారు. డిమాండ్‌ పెరగడంతోనే ఈ సమస్య తలెత్తిందని, త్వరలోనే కోతలు నివారిస్తామని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.