తరగతి గదుల కొరత తీర్చండి: విద్యా కమిషన్ ఛైర్మన్కు వినతిపత్రం

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తుర్కపల్లి పాఠశాలలో అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని కోరుతూ శివప్రసాద్, పరహాణ అన్వర్ సోమవారం విద్యా కమిషన్ ఛైర్మన్ చారగొండ వెంకటేష్కు వినతిపత్రం అందజేశారు. గదుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తక్షణమే స్పందించి అదనపు గదులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.