నాశంపల్లిలో వైద్య సేవలందించిన వైదేహి సూపర్ స్పెషాలిటీ ఉచిత శిబిరం
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం నాశంపల్లి గ్రామంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ సర్పంచ్ ఎల్.నీలావతి, డాక్టర్ ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ శిబిరంలో నూట మందికి పైగా పేద రోగులకు వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.