పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల కనీస హాజరు శాతాన్ని 95 శాతానికి పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం సగటు హాజరు 85.45 శాతంగా ఉండగా, మూడు రోజులు గైర్హాజరైతే తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించనున్నారు. అలాగే పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని అమలు చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న తరగతి గదులపై ప్రత్యేక దృష్టి సారించారు.