అలరిస్తోన్న 'ముగ్గురు కోతులు' చిత్రంలోని చిల్లర సాంగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో వస్తోన్న 'ముగ్గురు కోతులు' సినిమాలోని 'చిల్లర సాంగ్'ను యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ విడుదల చేశారు. ఎస్. సుహాస్ అందించిన బాణీలు, సాహిత్యం ఎంతో క్యాచీగా ఉన్నాయి. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శోభారాణి గరిమెల్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.