విశాఖలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీస్ యంత్రాంగం
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సహాయంతో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. యువతను పెడదోవ పట్టిస్తున్న మత్తు పదార్థాల కట్టడికి పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.