చెన్నైలో ప్రముఖ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ వి.హరీశ్ అనుమానాస్పద మృతితో తీవ్ర కలకలం

రిపోర్టర్: సునీల్ స్థలం: Chennai

చెన్నై శివారులోని ముట్టుకాడులో ప్రసిద్ధ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ వి.హరీశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించిందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన సైబర్ వేధింపులు, బెదిరింపుల వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని హరీశ్ తండ్రి జె.వినాయగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసన్ శామ్యూల్ అనే వ్యక్తి తనను వేధించాడని మరణానికి ముందు హరీశ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కానత్తూరు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.