ఓరుగల్లు ఎయిర్‌పోర్ట్‌కు కాకతీయ పేరు పెట్టాలని సందీప్ డిమాండ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Warangal

వరంగల్ విమానాశ్రయానికి రుద్రమదేవి లేదా కాకతీయ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ పేరు పెట్టాలని ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన సూచనలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబించేలా శక్తివంతమైన పేర్లు ఉండాలన్న ఆయన ప్రతిపాదనను స్థానికులు, నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఓరుగల్లు వైభవాన్ని చాటేలా ఈ పేర్లు పెట్టడం సముచితమని పలువురు అభిప్రాయపడుతున్నారు.