షాకింగ్ ఘటన: ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో ప్రియుడి అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: Kolhapur

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థిని తన్నుమ్ నాయక్ హత్య కేసులో ఆమె ప్రియుడు శ్రీపద్ వాదర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి వివేక్ పాటిల్ వెల్లడించారు. వివాహం వేరే చోట నిశ్చయమవడంతో ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందని, నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి కోర్టు రిమాండ్ చేసిందని అధికారులు తెలిపారు.