బూరుగుపల్లి బడిలో ముందస్తు బతుకమ్మ సంబరాలు: సంస్కృతిని చాటిచెప్పిన విద్యార్థులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బూరుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల తీరొక్క పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలను పేర్చి పాఠశాల ఆవరణలో ఉత్సాహంగా ఆడారు. ఉపాధ్యాయులు, గ్రామ మహిళలు, అంగన్వాడీ కార్యకర్త మహేశ్వరి విద్యార్థినులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. దసరా సెలవుల్లో పిల్లలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయురాలు సంతోషి కుమారి సూచించగా, గ్రామ పెద్దలు సాంస్కృతిక వేడుకలను ఘనంగా ప్రశంసించారు.