గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ బాట: అడవితల్లి బాట ప్రారంభం

రిపోర్టర్: సతీష్ స్థలం: రంపచోడవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం కోసం ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రంపచోడవరం పరిధిలోని కాకవాడ గ్రామంలో రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా, వైద్యం, విద్య వంటి మౌలిక వసతుల కల్పనే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. గత ప్రభుత్వం నిధులను వృథా చేసిందని విమర్శించారు.