కష్టకాలం నేర్పిన పాఠంతోనే డబుల్ సెంచరీ చేశా: ఇషాన్ కిషన్
రిపోర్టర్: రాము
స్థలం: India
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ పై 270 పరుగుల సంచలన డబుల్ సెంచరీ సాధించిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన అద్భుత ఇన్నింగ్స్ రహస్యాన్ని వెల్లడించాడు. కెరీర్ లో కష్ట కాలాన్ని ఎదుర్కొన్న తర్వాత అంచనాలను పక్కన పెట్టి పూర్తిగా బ్యాటింగ్ పైనే దృష్టి సారించినట్లు చెప్పాడు. అనవసర ఆలోచనలతో ఒత్తిడి పెంచుకోకుండా బాల్ చూసి ఆడటం పైనే శ్రద్ధ పెట్టానని, కష్టకాలమే తనకు సరైన పాఠం నేర్పిందని ఇషాన్ స్పష్టం చేశాడు.