నెల్లూరులో పుర ఎన్నికల ప్రచారం జోరు: కూటమి శ్రేణుల్లో ఉత్సాహం
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం పట్టణాల్లో పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుందని అధికారులు తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా తెదేపా, జనసేన, భాజపా నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. మంత్రి నారాయణ, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపుతున్నారని, వైకాపాలో మాత్రం తగిన సహకారం లేక అభ్యర్థులు నిరాశలో ఉన్నారని వెల్లడించారు.