షాకింగ్ ఘటన: కూరగాయలు కొంటూ గుండెపోటుతో మార్కెట్లో వ్యక్తి దుర్మరణం
రిపోర్టర్: విజయ్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బేతవోలు కూరగాయల మార్కెట్‌కి వచ్చిన ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు గురై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. మార్కెట్లో జరిగిన ఈ అకస్మాత్తు మరణం చూసి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.