తమిళనాడులో ప్రధాని మోదీ టూర్: చెన్నైలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో పలు భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.