ది ప్యారడైజ్ ప్రీరిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో నాని

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన ది ప్యారడైజ్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో నటుడు నాని పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వేడుకలో అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన నాని, తమ సినిమా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేడుకలో ప్రభాస్ నటించిన ఫౌజీ చిత్రం విడుదల వాయిదా పడినట్లు నిర్మాత వై.రవిశంకర్ ప్రకటించారు.