ఆకట్టుకునేలా ఏడుగురు మహిళల యూరప్ ట్రిప్ 'హ్యాపీ జర్నీ' ట్రైలర్

రిపోర్టర్: సునీల్ స్థలం: India

గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్ర ట్రైలర్ విడుదలయింది. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో ఏడుగురు మహిళల ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సినిమా యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్, ఎమోషన్స్‌తో సాగుతుంది. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రం అందమైన విజువల్స్, శేఖర్ చంద్ర సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.