గోపాలపురంలో మన సీఎం మనకు అండగా కార్యక్రమంలో దేవినేని ఉమా భాగస్వామ్యం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఎన్టీఆర్

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చిట్యాలలో నిర్వహించిన మన సీఎం మనకు అండగా కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన ఇన్చార్జ్ సువర్ణరాజులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలతో మమేకమయ్యారు.