కుప్పం అభివృద్ధికి కోట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు వెల్లడి
రిపోర్టర్: విజయ్
స్థలం: కుప్పం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి రూ.38 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.289 కోట్ల ప్రాజెక్టులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలం నుంచి కుప్పానికి నీటిని తీసుకువచ్చామని గుర్తుచేస్తూ, రాయలసీమను ఎడారిగా కానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. కుప్పం ప్రజలతో తనది రాజకీయ సంబంధం కాదని, 40 ఏళ్ల అనుబంధం ఉన్న కుటుంబ సంబంధమని చెబుతూ సీఎం భావోద్వేగానికి గురయ్యారు.