'ఐదు రోజుల పాటు వర్షాలు': తెలంగాణలో భారీ వర్ష సూచన
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు పలు జిల్లాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ వర్షాలు పడే సూచనలు ఉండటంతో ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక నుంచి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ఐఎండి స్పష్టం చేసింది.