నిధుల కోసం సీఎంను కలిస్తే తప్పేంటి: రాజగోపాల్ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: నల్గొండ
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎంతో తనకు కేవలం అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నాయని, మంత్రి పదవి కోసం ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. మంత్రి పదవిపై హైకమాండ్ మాటిచ్చిందని, అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని ఆయన పేర్కొన్నారు.