హైదరాబాద్ మూసాపేటలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడిన హైడ్రా సిబ్బంది
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని మూసాపేట ఆంజనేయనగర్‌లో లిఫ్టు గ్రిల్స్‌లో కాలు ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి అనే వ్యక్తిని హైడ్రా, ఫైర్ సిబ్బంది దాదాపు గంటన్నర పాటు శ్రమించి సురక్షితంగా కాపాడారు. రెండో అంతస్తులో దిగుతున్న సమయంలో సెన్సార్లు సరిగా పనిచేయక లిఫ్ట్ నక పైకి వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించగా, గోడను బద్దలు కొట్టి హైడ్రాలిక్ కట్టర్ సాయంతో బాధితుడిని బయటకు తీశారు.