గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
రిపోర్టర్: గోపి
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
గణేష్ నిమజ్జనాల వేడుకలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ స్పష్టం చేశారు. నార్సింగి పరిధిలోని కోకపేట చెరువు వద్ద కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బందోబస్తు చర్యలు పటిష్టం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.