తాగునీటి కొరత నివారణకు ముందస్తు వ్యూహాలు రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
తాగునీటి కొరత నివారణకు ముందస్తు వ్యూహాలు అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే ముప్పును ఎదుర్కొనేందుకు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు మండలాల వారీగా త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేయాలని, సింగూరు ప్రాజెక్ట్ నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఉపాధి హామీ పనులను పెంచాలని ఆమె పేర్కొన్నారు.