జీర్ణవ్యవస్థపై టీబీ దాడి: ప్రాణాంతకంగా మారే ఇంటెస్టినల్ టీబీ లక్షణాలు ఇవే
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
జీర్ణవ్యవస్థపై కూడా టీబీ బ్యాక్టీరియా దాడి చేస్తుందని డాక్టర్ శివకుమార్ వరకనహళ్లి వెల్లడించారు. దీనిని ఇంటెస్టినల్ టీబీ అంటారని, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల ఇది సోకుతుందని ఆయన తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని, పొట్ట సమస్యలని నిర్లక్ష్యం చేయరాదని ఆయన హెచ్చరించారు. దీర్ఘకాలిక దగ్గు లేకపోయినా పేగుల టీబీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.