హైబీపీ సైలెంట్ కిల్లర్: ప్రాణాంతక పక్షవాతం ముప్పుపై వైద్య నిపుణుల తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

లక్షణాలు లేకపోయినా అధిక రక్తపోటు లోలోపల మెదడులోని సూక్ష్మ రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఏళ్ల తరబడి చికిత్స తీసుకోకపోతే పక్షవాతం ముప్పు ముంచుకొస్తుందని హెచ్సీజీ సుచిరాయు హాస్పటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సంకేత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎలాంటి అసౌకర్యం లేనంత మాత్రాన గుండె, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని ఆయన హెచ్చరించారు.