వాయుగుండం ముప్పుపై అధికారులతో సమీక్షించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున విజయనగరం జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి తుఫాన్ ప్రభావంపై ఆయన సమీక్షించారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని వసతులు కల్పించాలని సూచించారు.