భారీ మోసం బట్టబయలు: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సరితా గైక్వాడ్ కు షాక్
రిపోర్టర్: మహేష్
స్థలం: డాంగ్
ఇసుక వ్యాపారంలో భారీ లాభాలు ఇస్తామని నమ్మించి, భారత అథ్లెట్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సరితా గైక్వాడ్‌ను నితిన్ భారతి మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. గుజరాత్ లో ఆమె నుంచి సుమారు అరవై తొమ్మిది లక్షల రూపాయలు కాజేసి పరారయ్యాడని అధికారులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై క్రిమినల్ నమ్మకద్రోహం, చీటింగ్ కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.