భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న చంద్ర సిద్ధార్థ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన మిస్టరీ మ్యూజికల్ చిత్రం 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. మదన్ కథతో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. సౌండ్ థెరపీ, న్యూరోసైన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు తెలిపారు. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.