కేప్‌టౌన్‌లో కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న 69వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ దేశానికి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సొవెటోలోని నెల్సన్‌ మండేలా నివాసం, మ్యూజియంతో పాటు లయన్‌ అండ్‌ సఫారీ పార్క్‌ను ఆయన సందర్శించారు. రాష్ట్రంలో జూ పార్కుల మెరుగైన నిర్వహణ, పర్యాటక అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.