నెల్లూరు మేయర్ మరియు ముప్పైవ వార్డు కౌన్సిలర్గా మల్లెల శ్రీహరి నామినేషన్

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరంలో మేయర్ పదవితో పాటు ముప్పైవ వార్డు కౌన్సిలర్ స్థానానికి మల్లెల శ్రీహరి నామినేషన్ సమర్పించారు. ఎన్ఐటీ వరంగల్లో పీహెచ్డీ పూర్తి చేసిన శ్రీహరి నగర అభివృద్ధి కోసం తాను చేసిన సేవలను వివరించారు. ప్రజల సంక్షేమం, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ ఎన్నికల బరిలోకి దిగినట్లు ఆయన తెలిపారు.