తెలంగాణలో గణేష్ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఎక్సైజ్ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేశారు.