క్రీడల్లో సత్తా చాటుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికైన పల్లెటూరి విద్యార్థులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: బిట్రగుంట

పల్లెటూరి పిల్లలు క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. బిట్రగుంట ప్రాంతానికి చెందిన పలువురు చిన్నారులు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహాయంతో తైక్వాండో, క్రికెట్ పోటీల్లో సత్తా చాటారు. జిల్లా స్థాయిలో బంగారు పతకాలు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే కష్టపడి చదువుతూ క్రీడల్లోనూ విజయాలు సాధిస్తున్న ఈ విద్యార్థులని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించడమే తమ లక్ష్యమని ఆ విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.