విద్యారంగ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఖమ్మం దివాకర ఆదేశం
రిపోర్టర్: సురేష్
స్థలం: ఖమ్మం
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, క్లస్టర్ హెడ్మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఖమ్మం (Collector Khammam) దివాకర టిఎస్ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే దిశగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, బోధనా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.