పులివెందులలో జగన్ కుటుంబ హవా త్వరలో తుడిచిపెట్టుకుపోతుంది: వర్ల రామయ్య
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
పులివెందులలో మాజీ సీఎం జగన్ కుటుంబ హవా మున్సిపల్ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు. విజయవాడలో ఎస్ఈసీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ డ్రామాలను ప్రజలు గమనించాలని కోరారు. హెలికాప్టర్ ను ఎవరూ ఆపకపోయినా గాల్ లో చక్కర్లు కొట్టి అరాచకాలు చూశానని చెప్పడం హాస్యాస్పదమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.