అన్నదాతలకు తీపి కబురు: ప్లాంట్ జీనోమ్ అవార్డు దక్కించుకున్న కర్ణాటక మహిళలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ధార్వాడ్
దేశవ్యాప్తంగా వరి, ఇతర సంప్రదాయ పంటల విత్తనాలను పరిరక్షిస్తూ సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్న కర్ణాటకలోని బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక సంఘానికి ప్రతిష్టాత్మక ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు లభించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. కుండ్గొల్ తాలూకా తీర్థ గ్రామానికి చెందిన బీబీజాన్ మౌలాసాబ్ హలేమణి నేతృత్వంలో ఈ బృందం గత కొన్నేళ్లుగా వందలాది వరి, చిరుధాన్యాల రకాలను కాపాడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.