డాక్టర్ జగదీష్ మృతికి నివాళులర్పించిన సీపీఐ జాతీయ మరియు జిల్లా నేతలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ మృతి బాధాకరమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కామ్రేడ్ భాగం హేమంతరావు అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉంచిన జగదీష్ మృతదేహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించిన జగదీష్ మృతి వైద్య రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.