కూటమి పాలనపై మర్రిపాడు మండలంలో సానుకూల స్పందన: ఆనం రామనారాయణ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో సానుకూలంగా ఉందని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి మధ్య తేటతెల్లమైన వ్యత్యాసాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గమనిస్తే గతంలో కేవలం ఒక్క బిడ్డకే తల్లికి వందనం అమలు చేయగా నేడు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.