బస్తర్ దస్రా ప్రత్యేకత: రావణ దహనం లేకుండానే అంగరంగ వైభవంగా వేడుకలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బస్తర్

దేశవ్యాప్తంగా దసరా అనగానే రావణ దహనం గుర్తుకు వస్తుంది. కానీ ఛత్తీస్గఢ్లోని బస్తర్లో మాత్రం ఈ సంప్రదాయం పూర్తిగా భిన్నంగా ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయకుండా, ఆరాధ్య దైవమైన దంతేశ్వరి అమ్మవారి పూజలు, గిరిజన ఆచారాలతో దాదాపు డెబ్బై ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.