హైదరాబాద్‌లో రేపు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, వాహనదారులకు హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో రేపు జరగనున్న మహా ధర్నా, ముఖ్యమంత్రి బహిరంగ సభల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్నా చౌక్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. నల్లకుంట, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.