ఎడ్ఎక్స్ వేదికగా ఉచిత ఆన్లైన్ కోర్సులు ప్రకటించిన ఎస్బీఐ

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

నిరుద్యోగులు మరియు విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రముఖ ఎడ్ఎక్స్ వేదిక ద్వారా ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కృత్రిమ మేధస్సు, కంటెంట్ మార్కెటింగ్, పర్సనల్ బ్రాండింగ్, అగ్రి ఈ-కామర్స్ వంటి పలు రకాల ఆధునిక అంశాలపై ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలోని అనుభవంతో ఈ విద్యా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొంటూ, ఆసక్తి గల అభ్యర్థులు ఈ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.