రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధికి పద్దెనిమిది వేల కోట్ల కేటాయింపు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.18,945 కోట్లతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. భవనాలు, వసతులు, సిబ్బంది కొరత వంటి సమస్యలను నివారించేందుకు క్యాపిటల్ హెల్త్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి వైద్యశాలల్లో మౌలిక వసతులను సమూలంగా మార్చేసి నాణ్యమైన వైద్యం చేరువ చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.