స్థానిక సంస్థల ఎన్నికలపై పలాసలో కాంగ్రెస్ కీలక సమావేశం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తంగుడు వీర్రాజు అధ్యక్షతన ఘనంగా జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.