గుండెపోటు బాధితులకు తక్షణమే సీపీఆర్ చేయడం ప్రాణాలను కాపాడుతుంది

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

గుండెపోటుతో కుప్పకూలిన బాధితులకు వైద్య సహాయం అందేలోపు తక్షణమే సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని మాక్స్ హాస్పిటల్ కార్డియాలజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ గోయెల్ తెలిపారు. బాధితుడు స్పందించకపోతే భుజాలపై తట్టి శ్వాసను పరిశీలించాలని, నూట ఇరవై కంప్రెషన్ల వేగంతో సీపీఆర్ ప్రారంభించాలని నిపుణులు సూచించారు. అంబులెన్స్కు సమాచారం అందిస్తూనే ఏఈడీ పరికరాన్ని ఉపయోగించి ప్రాథమిక చికిత్స అందించాలని వైద్యులు స్పష్టం చేశారు.