దేశ భద్రతను విమర్శించడం రాహుల్ గాంధీ దిగజారుడుతనమంటూ జి కిషన్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

దేశం ఓడిపోవాలని కోరుకుంటూ సైనికులను, సుప్రీంకోర్టును, ఎన్నికల సంఘాన్ని, చివరకు దేశ భద్రతకు రక్షణగా నిలిచే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారిని కూడా విమర్శించడం రాహుల్ గాంధీ దిగజారుడుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అజిత్ దోవల్ గారు దేశ రక్షణ కోసం సేవ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ కోసమో కాదని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.