కొల్లు నర్సింహారెడ్డి మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళి
రిపోర్టర్: Raju Reporter
స్థలం: ఆత్మకూర్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన కొల్లు నర్సింహారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.