అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిఆర్‌ఎస్ మహిళా నేతల పట్ల పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. జరిగిన ఘటనకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇది శాసనసభ కాదని ‘దుశ్శాసన సభ’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.